ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయ తొలిపూజ
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలోని ప్రఖ్యాత ఖైతరాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్‌లో 40 అడుగులతో పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రతిష్టించారు. మహాగణపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, హరియాణా గవర్నర్ బంగారు దత్తాత్రేయ తొలి పూజ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేయడం తన అదృష్టమని గవర్నర్ అన్నారు. కరోనాను విఘ్నేశ్వరుడు పారదోలాలి. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని గవర్నర్ కోరారు. తెలంగాణ ప్రజలందరికీ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని గవర్నర్ ప్రార్థించారు.