భక్తులకు కొంగు బంగారం .. ఏడిద పెద్దమ్మ తల్లి

ఏడిద వారి ఆడపడుచు రత్నావతి దేవి నేడు పెద్దమ్మతల్లి గా విరాజిల్లుతున్నది.
సృష్టిలో ప్రతీ విషయంలో పార్వతీదేవి కీలక పాత్ర వహిస్తుంది. మన భారతదేశంలో దక్షయజ్ఞం జరిగిన తరువాత పార్వతీదేవి ఆత్మాహుతి తరువాత ఏర్పడిన పరిణామాలతో అష్టాదశ శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. ఈ అష్టాదశ శక్తి పీఠాలు మనకు సమీపంలో కూడా ఉన్నాయి. తుల్యభాగ నదీ పరివాహక ప్రాంతం కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నది.
ఒక మానవ కన్య భూలోకంలో జన్మించి అనేక మహిమలు చూపి పెద్దమ్మ తల్లి గా అవతరించిన విషయం నేడు మనం తెలుసుకుందాం.
పురాణాల చరిత్రను మనం అవగతం చేసుకుంటే మాండవ్య పురం సంగమేశ్వరం 5 కిలోమీటర్లు పరిధిలోనే ఉంటాయి. క్రీస్తుశకం రెండవ శతాబ్దం నుండి ఈ ప్రాంతాలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ఇతిహాసాలు పరిశీలిస్తే ఏడిద గ్రామం పురాణాల్లో ఎంతో ప్రాచుర్యం చెందింది.
మాండవ్య మహాముని ఈ ప్రాంతంలో తపస్సు చేసిన కారణంగా ఈ ప్రాంతానికి మాండవ్య పురం అనే పేరు వచ్చింది. నేడు మండపేట గా విరాజిల్లుతుంది.ఈ ప్రాంతంలో సప్త గోదావరి అంతర్లీనంగా ప్రవహించిన దాఖలాలు ఉన్నాయి.
సప్తగోదావరి ప్రవహిస్తుంది కాబట్టి ఈ ప్రాంతానికి సంగమేశ్వరం అని పేరు వచ్చింది. పార్వతీదేవి అంశంలో క్రీస్తుశకం 185 వ సంవత్సరంలో అనగా కృతయుగం కాలంలో ఏడిద గ్రామంలో శూద్రులు తాడిపత్రి కోటేశ్వర నాయుడు- వెంకట్రావమ్మ దంపతులకు రత్నావతీదేవి జన్మించింది. ఈమె జననం 24 -11 -185 గా ఉంది. రత్న రత్న దేవి జన్మించగానే అప్పటివరకు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రాంతం ఒక్కసారిగా వర్షపు జల్లులు కురిశాయి. తమ కుమార్తె ఒక శుభసూచకంగా భావించి ఆమెకు రత్నావతి దేవిగా నామకరణం చేశారు. యుక్త వయసు రాగానే ఆమె తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉన్న లేళ్ల వీరభద్రుడు -మహంకాళి దంపతుల కుమారుడు
నరసింహనాయుడు తో 8-6-196 వసంవత్సరంలో వివాహం జరిపించారు. రత్నావతి దేవి వివాహం జరిగిన తర్వాత అత్తవారింట్లో అత్తమామలు ఆడపడుచులను మధ్య ఉమ్మడి కుటుంబం గా సంసారం చేసింది అయితే మావగారు మినహాయించి అత్త ఆడపడుచులు నేను ప్రతిరోజు తీవ్రంగా హింసించేవారు. పార్వతి దేవి భక్తురాలైన అనగా ఆమె అంశాల జన్మించిన రత్నావతి దేవి ఆ హింసలకు భరిస్తూ నిత్యం ఓం నమశ్శివాయ అంటూ పంచాక్షరీ మంత్రాన్ని జీవించేది పై ఒక్కొక్కసారి ఇ రత్నావతి దేవిని తీవ్రంగా కొట్టి ఆమె పుట్టింటికి పంపించేవారు. ఈ క్రమంలో దుర్భర జీవితాన్ని గడుపుతూ ఎంతో ఓర్పు సహనం తో ఉండేది సంపన్నులైన అత్తవారింట సకల సదుపాయాలు ఉన్నప్పటికీ ఆమెన్ ఒక పని మనిషి కంటే చూస్తూ ఉండే వారు భర్త స్త్రీలోలుడు కావడంతో రత్నావతి ని పట్టించుకునేవాడు కాదు. వీరికి వేలాది ఎకరాలు భూములు బంగారం వజ్రవైడూర్యాలు ఉన్నప్పటికీ ఆమె చాలా హీనాతిహీనంగా బతికింది. ఈమెకు ఎనిమిది మంది సంతానం కలిగారు. మామగారు వీరభద్రుడు పిల్లలను చూడడంతో ఆమెకు కొంత కలిగించింది.
తన కుటుంబ విషయాలన్నీ రత్నావతి దేవి తమ తల్లిదండ్రులకు తెలిపేది కాదు. తన పుట్టింటి వారికి తన ఇంటికి రావద్దని చెప్పడం వల్ల ఎవరు రత్నావతి దేవి ఇంటికి వచ్చేవారు కాదు. ఈ బాధలను తన తల్లిదండ్రులను చూస్తే తట్టుకోలేరు అని భావించి రత్న వతీదేవి వారిని రావద్దు అని చెప్పడం జరిగింది. ఈతిబాధలు అనుభవిస్తున్న ఆమెను అడ్డు తగిలించు కోవాలని 8 మంది పిల్లలకు తల్లి అయిన రత్నావతీదేవిని
నిద్రిస్తున్న తరుణంలో 4-12-210 వతేదీన రోకలి తో భర్త,అత్త, ఆడపడుచు హత్య చేసారు. అనంతరం ఆమె మృతదేహాన్ని మాండవ్య పురంకు వెళ్లే రహదారిలో ఒక దిగుడు బావిలో పడ వేసారు. ఆ ప్రదేశంలో ప్రయాణిస్తున్న బాటసారులకు నన్ను రక్షించండి…పైకి తీయండి…అనే హాహాకారాలు వినిపించేవి.
ఈ విధంగా 10 సంవత్సరాల పాటు రత్నావతీ దేవి ఆ బావిలో ఉండి శిలగా అనగా పెద్దమ్మ తల్లి విగ్రహం గా మారింది. ఆ దిగుడు బావి వద్ద ఎవ్వరైనా నమస్కారం చేసి పూజలు చేస్తే వారి కోరిన కోర్కెలు తీర్చేది.
ఇదిలా ఉండగా ది.20-3-220వ తేదీన ఏడిద గ్రామ పెద్దలకు,తన మావగారైన లేల్ల వీరభద్రయ్య కు కలలో కనిపించి తాను దిగుడు బావిలో విగ్రహ రూపంలో ఉన్నానని చెప్పడంతో వారు బావిలో ఉన్న విగ్రహాన్ని తీసి పూజలు ప్రారంభించారు.
నాటి నుండి నేటి వరకూ రత్నావతీ దేవి ఏడిద,మాండవ్య పురం,సంగమేశ్వరం ప్రాంతాల దేవతగా ఉండేది. అనంతరం కాళికాదేవి గా మారి ఈ ప్రాంతంలో బలులు స్వీకరించడం జరిగేది.అనంతరం ఈ విగ్రహం సంగం కు చేరుకున్నది.అక్కడ ప్రతీ రోజూ సంగమేశ్వరుడు ను రాత్రి సమయాల్లో ఆత్మగా మారి సేవించేది.
తిరిగి తన యధాస్థానమైన దిగుడుబావికి 2000 సంవత్సరంలో చేరుకుంది. అర్థరాత్రి సమయంలో ఈ ప్రాంతం ద్వారా ఎవ్వరైనా ప్రయాణాలు చేస్తే వారి వాహనాలపై పెద్దమ్మ తల్లి కూర్చుని ఉండడం గమనార్హం. ఈ ఆలయాన్ని వాలిన వీరబాబు అభివృద్ధి చేసారు.ప్రధాన అర్చకులు గా మేడిశెట్టి సూర్య భాస్కరరావు వ్యవహరిస్తున్నారు.
-టి.వి.గోవిందరావు
సీనియర్ జర్నలిస్టు, అడ్వకేట్