విఎస్‌యూ ఉద్యోగులకు, విద్యార్థులకు కొవిడ్ వ్యాక్సిన్..
నెల్లూరు (CLiC2NEWS) : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నేడు కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ ఎల్ విజయ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకొని, కరోనా వైరస్ నివారణకు, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కొవిడ్ థర్డ్ వేవ్ ముంచుకొస్తొందని, ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. జనసంద్రత ఎక్కువగా వున్న ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన ఎన్ ఎస్ యెస్ విభాగాన్ని మరియు సహకరించిన కసుమురు ప్రభుత్వాసుపత్రి వైద్యులు డా. శంకరయ్య వారి సిబ్బందిని ఉపకులపతి ఆచార్య సుందరవల్లి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమలో ఎన్ యస్ యస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం, సహాయక రిజిస్ట్రార్ సుజయ్ కుమార్, డాక్టర్ టి. వీర రెడ్డి, ఎన్ యస్ యస్ సిబ్బంది, మరియు ఎన్ యస్ యస్ వాలంటీర్లు తదిరరులు పాల్గొనారు.