కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కెటిఆర్ భేటీ

ఢిల్లి (CLiC2NEWS): తెలంగాణ ఎంపీలు, మంత్రులు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేటిఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రధాన సమస్యగా మరిన ధాన్యం కొనుగోళ్ల అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి పంటలో ఎంత ధాన్యం ఏ రూపంలో కొనుగోలు చేస్తారో తేల్చాలని ప్రశ్నించారు. సమావేశంలో కెటిఆర్ తోపాటు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రత్యేక సీఎస్ రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.