మెట్రో విస్త‌ర‌ణ‌కు ఆర్ధిక సాయం అందించండి కెటిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో రెండో ద‌శ కింద నిర్మించ‌బోయే మెట్రో విస్త‌ర‌ణ‌కు నిధులు కేటాయించాల‌ని రాష్ట్ర ఐటి, పుర‌పాల‌క శాఖ మంత్రి కెటిఆర్ కేంద్ర మంత్రి హ‌రిప్రీత్ సింగ్‌కు లేఖ రాశారు. హైద‌రాబాద్‌లో రెండో ద‌శ కింద బిహెచ్ ఇఎల్‌-ల‌క్డికాపూల్‌, నాగోల్‌-ఎల్‌బిన‌గ‌ర్ మెట్రో విస్త‌ర‌ణ‌కు ఆర్ధిక‌సాయం అందించాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రికి లేఖ రాశారు. దీని నిర్మాణానికి రూ. 8453 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అధికారులు అంచ‌నావేశారు. 2023-24 బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు. మెద‌టి ద‌శ కింద 69 కిలోమీట‌ర్ల మేర నిర్మించిన మెట్రో విజ‌య‌వంతంగా న‌డుస్తుంద‌ని.. రెండో ద‌శ‌లో 31 కిలోమీట‌రు పొడ‌వును రెండు భాగాల్లో రూపొందించార‌ని తెలియ‌జేశారు. బిహెచ్ ఇఎల్ నుండి ల‌క్డిక‌పూల్ వ‌ర‌కు 26 కిలోమీట‌ర్లు మేర 23 స్టేష‌న్లు, నాగోల్ నుండి ఎల్‌బిన‌గ‌ర్ వ‌ర‌కు 5కిలోమీట‌ర్ల మేర 4 స్టేష‌న్లు నిర్మించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.