మార్చి 1 నుండి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి (CLiC2NEWS): మార్చి 1వ తేదీ నుండి ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మాత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 1 నుండి 11 వరకు జరగనున్న ఈ బ్రహ్మాత్సవాలలో 7న ఎదుర్కోలు మహోత్సవం, 8న తిరు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 9న దివ్య విమాన రథోత్సవం జరగనుంది. ఈ బ్రహ్మోత్సవాల జరుగుతున్నందున కల్యాణాలు, హోమాలు, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చన సేవను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.