లతా మంగేష్కర్ ఇకలేరు..!

ముంబయి (CLiC2NEWS): గాన కోకిల లాతా మంగేష్కర్ కన్నుమూశారు. 92 యేళ్ల లతా మంగేష్కర్ జనవరి 8వ తేదీన కరోనా బారిన పడ్డారు. గత 29 రోజులుగా ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్ప పొందుతున్నారు. కొద్ది రోజులకు ఆమె కోలుకొన్నట్లు వైద్యులు, కుటుంబ సబ్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం లతా మంగేష్కర్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. కాగా ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు.
వివాదాలకు అతీతంగా, అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. 30కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో వేల గీతాలను ఆలపించారు. ఎక్కువగా హిందీ, మరాఠీ భాషల్లో ఆమె పాటలు పాడారు. గాయనిగా ఏడు దశాబ్దాలకు పైగా అలరించిన లతా మంగేష్కర్ 1929 సెప్టెంబరు 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. తండ్రి వద్దే ఓనమాలు నేర్చుకున్న లత ఐదేళ్ల వయసులో ఆలపించడం మొదలు పెట్టారు. 1947లో తన 13 యేళ్ల వయస్సులో `మజ్జూర్` చిత్రం ద్వారా గాయనిగా సినీ ప్రస్థానం ప్రారంభించారు. 1949లో మహల్ సినిమాలోని `ఆయేగా ఆనే వాలలా` అనే పాటతో గుర్తింపు పొందారు. 1948-78 మధ్య 30 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించారు.
భారత నైటింగేల్‌గా గుర్తింపు పొందిన లతా మంగేష్కర్ మొత్తం 170 మంది సంగీత దర్శకుల వద్ద 30 వేలకు పైగా పాటలు పాడారు. లతా సేవలకు గాను భారత్ ప్రభుత్వం 1969లో పద్మభూషణ్, 1999లో పద్మభూషణ్, 2001లో భారతరత్న పురస్కారాలు అందించింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు.