మానవ అక్రమ రవాణా కేసులో ఆరుగురికి జీవిత ఖైదు
హైదరాబాద్ (CLiC2NEWS): మానవ అక్రమ రవాణా కేసులో హైదరాబాద్ ఎన్ ఐఎ కోర్టు ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. 2019లో పాత బస్తీలోని చత్రినాక ఠాణాలో కేసు నమోదైంది. దాని ఆధారంగా ఎన్ ఐఎ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నిందితులపై కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేయగా.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఉద్యోగాల పేరిట బంగ్లాదేశ్ నుండి మహిళలను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దించినట్లు కోర్టు నిర్ధారించింది. నిందితులు యూసఫ్‌ఖాన్, అతడి భార్య , సోజిబ్, రాహుల్, అబ్ధుల్ సలాం, షీలాలకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.