LockDown: మరింత కఠిన ఆంక్షలు..

హైదరాబాద్ (CLiC2NEWS): సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో పోలీసులు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. పాస్‌లు, ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన రంగాలకు చెందిన వారి వాహనాలనే అనుమతిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్ అమలును డిజిపి మహేందర్‌రెడ్డి పరిశీలించారు. కూకట్‌పల్లిలో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో సడలింపు సమయం తర్వాత బయటకు వచ్చిన వాహనదారులను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా బయటకు వచ్చిన వాహనాలు సీజ్ చేశారు. మరోసారి బయటకు వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పల్లెల్లో తప్ప.. పట్టణాల్లోల లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలు కావడం లేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో.. పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలకు ఉపక్రమించారు.
హైదరాబాద్లో లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని సీపీ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. అనవసరంగా బయటకొస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు పహారా ఉన్నారని.. అనుమతి లేకుండా బయటకొచ్చిన వారు తప్పించుకోలేరని అన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. పోలీసులకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్ విధిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.