Lockdown: క‌ర్ణాట‌క‌లో 2 వారాల లాక్‌డౌన్‌

బెంగ‌ళూరు (CLiC2NEWS): దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. క‌ర్ణాట‌క రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజురోజుకిపెరిగిపోతోంది. ఈ రాష్ట్రంలో రోజువారీ కేసులు 50 వేల వ‌ర‌కూ చేరుకున్నాయి. దీంతో ఈ నెల 10న (సోమ‌వారం) ఉద‌యం 6 గంటల నుంచి ఈ నెల 24 ఉద‌యం 6 గంట‌ల‌ వ‌ర‌కూ పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు క‌ర్ణాట‌క సిఎం యెడ్యూర‌ప్ప శుక్ర‌వారం ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. క‌రోనా క‌ర్ఫ్యూ పెట్టిన పెద్ద‌గా ఫ‌లితం లేక‌పోయింద‌ని సిఎం యెడ్యూరప్ప అన్నారు. అన్ని హోట‌ళ్లు, ప‌బ్బులు, బార్లు మూసి ఉంటాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇక హోట‌ళ్లు, మాంసం దుకాణాలు, కూర‌గాయ‌ల దుకాణాలు మాత్రం ప్ర‌తి రోజూ ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కూ తెరిచి ఉంటాయ‌ని చెప్పారు.

ఉదయం మీడియాతో మాట్లాడిన సిఎం యడ్యూర‌ప్ప లాక్‌డౌన్‌పై రెండురోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. కానీ సాయంత్రం నాటికే తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.