LOCKDOWN: నిబంధనలు ఉల్లంఘిస్తే ఐసోలేషనే?

మంచిర్యాల(CLiC2NEWS) :కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగానున్న తరుణంలో ఎనరైనా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే నేరుగా ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు. పెద్దపల్లి,మంచిర్యాల, గోదావరిఖని, మంథనిలో ఉదయం 10గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన వారిని సుల్తానాబాద్ ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. బెల్లంపల్లి సెంటర్‌కు 79 మందిని తరలించారు. తర్వాత వారి కుటుంబసభ్యులను పిలిపించి కరోనా కష్టాలగురించి కౌన్సిలంగ్ నిర్వహించి వదిలిపెట్టారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దని వారిని హెచ్చరించారు.