శ్యామ్ సింగరాయ్ చిత్రం నుండి లిరికల్ సాంగ్ విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): శ్యామ్ సింగరాయ్ చిత్రం నుండి గురువారం లిరికల్ సాంగ్ విడుదల చేశారు. నాని కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం నుండి ‘తెరపైన కదిలేలా కథలేవో మొదలే.. తార.. నింగిదిగి నేల కింనడిచేలా’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేశారు. ఈపాటలో నాని దర్శకుడిగా, కృతిశెట్టి నటిగా అలరించారు. ఈపాటను కృష్ణకాంత్ రచించగా, కార్తిక్ ఆలపించారు. ఈ చిత్రం డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.