MAA Election: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ (CLiC2NEWS): మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు `మా` బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోతున్నారని కమిటీ సభ్యులను బాలకృష్ణ నిలదీశారు. మా’ ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని పట్టించుకోను అని చెప్పారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి బాలకృష్ణ ప్రస్తావించారు.
గతంలో ‘మా’ ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటూ… ఫస్ట్ క్లాస్ టికెట్లు వేసుకొని విమానాల్లో తిరిగారు. ఆ డబ్బులు ఏం చేశారు’’ అని బాలయ్య ప్రశ్నించారు.
అలాగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు శాశ్వత భవనాన్ని ఇంతకాలం ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించిన బాలయ్య… తెలంగాణ సర్కారు నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా అని ఎద్దేవా చేశారు.
‘మా’ శాశ్వత భవనం నిర్మాణానికి మంచు విష్ణు ముందుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించగా… నేనూ అందులో భాగస్వామినవుతాను.. అని బాలకృష్ణ తెలిపారు. అంతేకాదు అందరం కలిస్తే ‘మా’ కోసం ఇంద్రభవనం లాంటి భవనాన్ని నిర్మించుకోవచ్చని బాలయ్య సూచించారు.