MAA Elections: నామినేష‌న్ వేసిన‌ మంచు విష్ణు

హైద‌రాబాద్(CLiC2NEWS): ‘మా’ అధ్య‌క్ష ప‌ద‌వికి మంచు విష్ణు ఈరోజు త‌న ప్యానెల్ స‌భ్యుల‌తో క‌ల‌సి నామినేష‌న్ స‌మ‌ర్పించారు. అత‌నితో పాటు ర‌ఘుబాబు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఉపాధ్య‌క్షుడుగా బాబుమోహ‌న్‌, మాదాల ర‌వి, పృథ్వీ రాజ్ , శివ‌బాలాజీ కోశాధికారి అభ్య‌ర్థులుగా వారి నామినేష‌న్ పత్రాలు స‌మర్పించారు.  త‌న మానిఫెస్టో చూసిన త‌ర్వాత చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ లు త‌న‌కే ఓటు వేస్తార‌ని న‌మ్మ‌కం ఉంద‌ని విష్ణు అన్నారు. అర్చన, అశోక్‌కుమార్‌, గీతాసింగ్‌, హరినాథ్‌బాబు, జయవాణి, మలక్‌పేట్‌ శైలజ, మాణిక్‌, పూజిత, రాజేశ్వరీరెడ్డి, సంపూర్ణేశ్‌బాబు, శశాంక్‌, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు.పి, స్వప్న మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల.ఎమ్‌.ఆర్‌.సి, రేఖ తదితరులు ఆయ‌న  ప్యానెల్ స‌భ్యులు‌. సోమవారం ప్రకాశ్‌రాజ్‌ అధ్యక్షుడిగా, జీవితా రాజశేఖర్‌ జనరల్‌ సెక్రటరీగా నామినేషన్‌ సమర్పించిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.