MAA Elections: నామినేషన్ వేసిన ప్రకాష్‌రాజ్

హైదరాబాద్ (CLiC2NEWS): ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాష్‌రాజ్ ఈరోజు తన ప్యానెల్ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ.. ఇవి ఎన్నికలు కాదు. పోటీ మాత్రమే, గెలిచేది.. ఓడేది ఓటర్లే. ‘మా’ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు అని అన్నారు. ఈప్యానెల్ యొక్క లక్ష్యం ‘మా’ అభ్యుదయం కోసం పనిచేయడమే అని తెలియజేశారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో ‘మా’ జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎన్ని వివాదాలు వచ్చినా మేమంతా ఒక్కటే కుటుంబం, ఒకరినొకరు కించపరుచుకోకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.