Maharashtra: జూన్ 1 వరకు ఆంక్షలు పొడిగింపు

ముంబయి (CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను మరింత కఠినతరం చేశాయి. తాజాగా మహారాష్ట్రలో కరోనా కట్టడి కోసం ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు వచ్చే నెల 1 వరకు కొనసాగుతాయని ఆ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో జూన్ 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు కొనసాగుతాయని ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే రాష్ట్రంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుందని వెల్లడించింది.