కాంగ్రెస్‌పై విమర్శలు కురిపించిన ప్రధాని మోడీ
నాందేడ్ (CLiC2NEWS): మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి ప్రతిపక్ష పార్టిపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగునున్నాయి . ఈ నేపథ్యంలో పార్టీ ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం నాందేడ్‌లో ప్రధాని మోడీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేశారు. ‘అర్టికల్ 370 ‘ రద్దు చేసినా తిరిగి పునరుద్దరించాలని కాంగ్రెస్ పట్టుపడుతోందని.. అదంటే వారికి ఎందుకు అంత ప్రేమ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీల్లో ప్రదర్శించే రాజ్యాంగం అసలైనది కాదని.. నకిలీదని మోడీ పేర్కొన్నారు. ఎరుపురంగు అట్ట వేసి ఉన్న ఖాళీ పుస్తకాన్ని చూపిస్తూ.. రాజ్యాంగం అని ప్రచారం చేస్తున్నారని, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర ప్రజలు బిజెపి, మహాయతి కూటమికి మద్దతుగా ఓట్లు వేయాలని.. మహాయతి ప్రభుత్వమే రాష్ట్రంలో వేగవంతమైన పురోగతిని తెస్తుందన్నారు. ప్రతిపక్షమైన మహా వికాస్ అఘాడి పై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలకు ఈ నెల 20వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.