కొచ్చి విమానాశ్ర‌యం త‌ర‌హాలో మామునూరు ఎయిర్‌పోర్టు..

వ‌రంగ‌ల్ (CLiC2NEWS): మామునూరు విమానాశ్రయానికి సంబంధించి భూసేక‌ర‌ణ ప్ర‌క్రియను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సిఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. శ‌నివారం ఎయిర్‌పోర్టుపై సిఎం స‌మీక్ష నిర్వ‌హించారు. విమానాశ్ర‌యానికి భూసేక‌ర‌ణ‌, పెండింగ్ ప‌నుల వివ‌రాల‌ను సిఎం అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ప‌నుల‌కు సంబంధించి ప్ర‌తి నెలా రిపోర్టు అందించాల‌ని అన్నారు. కేర‌ళ‌లోని కొచ్చి విమానాశ్ర‌యం త‌ర‌హాలో మామునూరు విమానాశ్ర‌యం ఉండాల‌ని సూచించారు. నిత్యం యాక్టివిటి ఉండేలా ఎయిర్‌పోర్టు డిజైన్ చేయాల‌ని సిఎం సూచించారు. వ‌రంగ‌ల్ మామునూరు విమానాశ్ర‌య అభివృద్ధికి కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల అనుమ‌తి నిచ్చింది.

Leave A Reply

Your email address will not be published.