Mancherial:కరోనాతో మరో జర్నలిస్టు మృతి

మంచిర్యాల (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో జర్నలిస్టులపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు జర్నలిస్టులు మహమ్మారి బారినపడ్డారు. అనేకమంది కొవిడ్ బారిన పడి మృతి చెందుతున్నారు. తాజాగా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాంనగర్ కి చెందిన సీనియర్ జర్నలిస్టు, హిందీ మిలాప్ రిపోర్టర్ కొండ్ర శ్రీనివాస్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన, పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అందరితో కలివిడిగా ఉంటూ వార్తల సేకరణలో నిత్యం ముందుండే శ్రీనివాస్ మరణాన్ని తోటి జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణం పట్ల జిల్లాలోని జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.