Mancherial: ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన బిజెపి నాయ‌కులు

మంచిర్యాల‌ (CLiC2NEWS): లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నస్పుర్ మున్సిపాలిటీకి చెందిన 150 మంది ఆటో డ్రైవర్లకు మంగ‌ళ‌వారం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ తో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు తమ వంతు గా నిత్యావసరాల వస్తువులు అందజేస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారికి ఆర్థిక సహాయం అందజేయాలని అన్నారు. కర్ణాటక లో అక్కడి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు. అలాగే మన రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు.

నస్పుర్ పట్టణ లోని శీర్కే, కృష్ణ కాలనీ, సంఘ మల్లయ్య పల్లి లో కోవిడ్ తో మృతి చెందిన కుటుంబాలను కలిసి పరామర్శించి 10 వేల రూపాయల చొప్పున 4 కుటుంబాలకు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అగల్ డ్యూటీ రాజు, పిట్టల రవి, పడాల సంజీవ్, కుర్ర చక్రవర్తి రావనవెని శ్రీనివాస్, సిరికొండ రాజు, పట్టి వెంకట కృష్ణ, సామ్రాజు రమేష్, తడురి మహేష్, మడిషెట్టి మహేష్, బిఎంఎస్ నాయకులు రజలింగు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.