Mancherial: బైక్ పై వేగంగా వచ్చి చెక్ పోస్ట్ గేట్‌ను ఢీ కొన్న యువకుడు

జన్నారం: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలా పూర్ చెక్ పోస్ట్ వద్ద విషాదం చోటు చేసుకుంది. అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద గేటు తగిలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఇద్దరు యువకులు బైక్ పై దండేపల్లి నుండి జన్నారం వైపు వెళ్తున్న క్రమంలో.. తపాల్ పూర్ చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని ఆపుతారన్నభయంతో వేగంగా వెళ్లిన యువకుడు మిత్రుడి మృతికి కారణమయ్యాడు. అటవీ శాఖ అధికారి గేటు ఎత్తి ప్రాణాలు కాపాడలని ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బైక్ ను డ్రైవ్ చేస్తున్న యువకుడు తలవంచి తప్పించుకున్నాడు. వెనుక ఉన్న మరోక యువకునికి చెక్‌పోస్టు గేట్ ను గమనించకపోవడంతో అది బలంగా తగిలింది. తీవ్రంగా గాయపడిన యువకుడు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఇంత జరిగినా వెనకున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో చూడకుండానే బైక్ నడిపే వ్యక్తి వేగంగా వెళ్లిపోవడం కొసమెరుపు.