Mancherial: రాంన‌గ‌ర్‌, ఎన్టీఆర్‌న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించిన ఎమ్మెల్యే దివాక‌ర్‌రావు

మంచిర్యాల (CLiC2NEWS):  జిల్లాకేంద్రంలోని రాంన‌గ‌ర్‌, ఎన్టీఆర్ న‌గ‌ర్ ల‌లో మంచిర్యాల ఎమ్మెల్యే దివాక‌ర్‌రావు ప‌ర్య‌టించారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, త‌దిత‌ర స్థానిక నాయ‌కుల‌తో క‌లిసి ఎమ్మెల్యే ప‌ట్ట‌ణంలోని ప‌లు ప్రాతంలో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో స్థానికంగా నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వీధుల్లో నెల‌కొన్న పారిశుధ్య స‌మ‌స్య‌ల‌పై ఎమ్మెల్యే స్థానికుల‌తో మాట్లాడారు. డ్రైనేజీ స‌మ‌స్య‌లు, రోడ్లు గుంతులు త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఆదివారం మంచిర్యాలోని ఎన్టీఆర్ న‌గ‌ర్‌ లో రోడ్ల‌ను ప‌రిశీలిస్తున్న ఎమ్మెల్యే దివాక‌ర్‌రావు ప‌ర్య‌టించారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్యం, సింగిల్ విండో చైర్మన్ సందెల వెంకటేష్, ఎన్టీఆర్ న‌గ‌ర్ టిఆర్ ఎస్‌ పార్టీ నాయ‌కులు గంగులు త‌దిత‌రులు

 

ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎమ్మెల్యే వెంట మంచిర్యాల పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్యం, సింగిల్ విండో చైర్మన్ సందెల వెంకటేష్, మాజీ కౌన్సిల‌ర్ అంకం మ‌నోజ్‌, ఎన్టీఆర్ న‌గ‌ర్ టిఆర్ ఎస్‌ పార్టీ నాయ‌కులు గంగులు, మల్లేష్, బిలాల్, సత్యం, ఆకుల శీను , టిఆర్ఎస్ యూత్ నాయకులు సంతోష్, ఇప్పప్రశాంత్, తుమ్మ ప్రశాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.