Mancherial: మేకల కాపరిపై పెద్దపులి దాడి

మంచిర్యాల (CLiC2NEWS): జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. జిల్లాల్లోని వేమ‌న‌ప‌ల్లి మండ‌లం ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఎనుముల శంక‌ర్‌పై పెద్దపులి దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన మేక‌ల కాప‌రి శంక‌ర్ మేక‌ల‌ను మేపుకొని ఇంటికి వ‌స్తుండ‌గా పులి దాటి చేసింది.
ఈ ఘ‌ట‌న తెలిసిన స్థానిక గ్రామాల ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. ఈ ఘ‌ట‌న ఒడ్డుగూడెం గ్రామానికి అతి స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో ఆ గ్రామ‌స్తులు తీవ్ర ఆందోళ‌న‌ళ‌ల‌కు గురవుతున్నారు.

కాగా పులి దాడిలో గాయప‌డిన మేక‌ల కాప‌రి శంక‌ర్‌ను చికిత్స‌కోసం మంచిర్యాలకు త‌ర‌లించారు. పెద్దపులి సంచరిస్తున్న వార్త‌ల నేప‌థ్యంలో స్థాన‌క గ్రామాల‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవ‌స‌ర‌మైతే త‌ప్ప ఒంటిరిగా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని అటవీ శాఖ అధికారులు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.