మండపేట: జోడో పాదయాత్రను జయప్రదం చేయాలి..

మండపేట (CLiC2NEWS): అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను జయప్రదం చేయాలని ఏఐసీసీ సభ్యుడు మండపేట నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కామన ప్రభాకరరావు విజ్ఞప్తి చేశారు. మండపేట, ఏడిద రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభాకరరావు మాట్లాడుతూ.. భారత దేశ సమైక్యత సమగ్రతను కాపాడడం కోసం రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు జయప్రదం చేయాలని కోరారు. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగిందన్నారు. కన్యాకుమారి నుండి మొదలైన ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పూర్తి చేసుకుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18న ఆంధ్రాలో రాహుల్ గాంధీ అడుగు పెట్ట బోతున్నారని చెప్పారు. 18 నుండి 21 వరకూ నాలుగు రోజుల పాటు ఆంధ్రాలో యాత్ర కొనసాగుతుందన్నారు. కర్నూల్ జిల్లా నుండి ప్రారంభమై ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయాల్లో ప్రజలను కలుసుకుంటారన్నారు. ఆంధ్రాలో చేపట్టే యాత్రకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పిల్లి అప్పన్న, సామంచి సుబ్రహ్మణ్యం, నూని మాచరరావు తదితరులు పాల్గొన్నారు.