Mandapeta: అన్ని గ్రామాల్లో కోవిడ్ ఐసొలేషన్ కేంద్రాలు..

మండపేట (CLic2NEWS): మండపేట మండల పరిధిలో అన్ని గ్రామాల్లోకి కోవిడ్ పేషెంట్స్ కు ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మండపేట ఎంపిడివో ఐదం రాజు తెలిపారు. బుధవారం ఏడిద సీతానగరం లో కోవిడ్ ఐసొలేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం వాక్సినేషన్ ను మండపేట రూరల్ ఎస్ ఐ రావూరి మురళి మోహన్ ప్రారంభించారు. తొలుత గ్రామ సర్పంచ్ వరద చక్రవర్తి కు తొలి వ్యాక్సిన్ వేశారు. మొత్తం 250 మందికి కోవ్యాగ్జిన్ తొలి డోసు వేశారు.
వాక్సిన్ తరువాత అన్ని జాగ్రత్తలు పాటించాలి: రూరల్ ఎస్ ఐ రావూరి మురళి మోహన్
వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో పని చేయాలంటే రోగ నిరోధక వ్యవస్థను పూర్తిస్థాయిలో పని చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని మండపేట రూరల్ ఎస్ ఐ రావూరి మురళీ మోహన్ పేర్కొన్నారు. బుధవారం ఏడిద సీతానగరం గ్రామంలో కోవాక్సిన్ మొదటి డోసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వాక్సిన్ అనంతరం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. అందుకే వ్యాక్సిన్ తీసుకునే ఒక రోజు ముందు కానీ.. ఆ తర్వాత కొద్ది రోజుల వరకు మద్యం సేవించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వెంకట రమణ, ద్వారపూడి పి హెచ్ సీ సిబ్బంది, ఏఎన్ఎం భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.