Mandapeta: వైభవంగా లక్షపత్రి పూజ..

మండపేట(CLiC2NEWS): మండపేట పట్టణంలోని 14 వ వార్డులో శెట్టిబలిజ రామాలయం వద్ద లక్షప్రతుల పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. దేవి నవరాత్రి మహోత్సవ సందర్భంగా శ్రీదేవి అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సామూహిక వ్రత సంకల్పం, అభిషేకాలు జరిగాయి. భవాని భక్తులు ఈ లక్ష పత్రి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విగ్రహ దాత పలివేల నాగేశ్వరరావు, సుబ్బలక్ష్మి దంపతులు పూజలు నిర్వహించారు. లక్ష పత్రి పూజ వడి దాతలు ద్వారంపూడి రామకృష్ణ రెడ్డి,బుల్లిమాంబ దంపతులు అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోశెట్టి బలిజ సంఘ టౌన్ అధ్యక్షులు పెంకే గంగాధర్,పలివెల నాగేశ్వరరావు,చొల్లంగి సూరిబాబు,గుత్తుల లోవరాజు,రాయుడు బాబి,అనుసూరి వెంకటరమణ,భవానీలు,మహిళలు,పాల్గొన్నారు.