Mandapeta: ఏడేళ్ల బీజేపీ పాలన పూర్తయిన సందర్భంగా సేవా కార్యక్రమాలు..

మండపేట (CLiC2NEWS): కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మండపేట లో బీజేపీ ఆధ్వర్యంలో సేవాహి సంఘటన్ పేరున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలన్న పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ కన్వీనర్‌ కోనసత్యనారాయణ పట్టణంలో మాస్క్ లు పంపిణీ చేసారు. ఆదివారం 24 వ వార్డు సంఘంపుంతలో నివసిస్తున్న పేదలకు ప్రతి ఇంటింటికీ వెళ్లి మాస్క్ లు పంపిణీ చేశారు. కోన మాట్లాడుతూ 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ 15వ ప్రధానిగా ప్రమాణం చేసిన తరువాత ఇప్పటికి ఏడేళ్లు పూర్తయ్యాయి అన్నారు. దేశం, ప్రజలు రెండుకళ్లుగా భావించిన మోడీ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు. సాహోసేపేతమైన నిర్ణయాలతో పెద్దనోట్లరద్దు, జీఎస్టీఅమలు ,పౌరసత్వసవరణ,తలాక్ రద్దు,కాశ్మీరువిభజన, అయోధ్య రామ మందిరం నిర్మాణం లాంటి ఎన్నో చారిత్రాత్మక పనులు చేశారన్నారు. దేశంలో అవినీతి, స్కాంలకు ఆస్కారం లేకుండా చక్కనిపాలన అందించారు అన్నారు. ప్రపంచానికే తలనొప్పిగా మారిన కరోనా మహమ్నారి బారినుండి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ ప్రపంచ దేశాల చేత శభాష్ భారత్ అనేలా మొదటి వ్యాక్సిన్ కనిపెట్టి ప్రపంచదేశాలకు సైతం వ్యాక్సిన్ అందజేసిన ఘనత ప్రధాని మోడీ దేనని అన్నారు. పదవికోసం కాకుండా ప్రజలకోసమే పనిచేస్తున్నారని మోడీ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం మండల అధ్యక్షులు తోరం రాము, జక్కా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.