ఎన్నో భావాలు.. ఎన్నెన్నో వర్ణాలు

ఒక్క ఫొటో వందల భావాల్ని పలికిస్తుంది. వెలకట్టలేని ఆనందాన్ని ఒక్కఫ్రేమ్లో భద్రపరుస్తుంది. చరిత్రను సజీవంగా ఉంచుతుంది. ఒక్క ఫొటో భవిష్యత్తు తరాలకు ఆనవాలుగా నిలుస్తుంది. అదే చరిత్రకు సాక్షీభూతంగా మారుతుంది. మధుర జ్ఞాపకాల్లో తేలిపోయేలా చేస్తుంది. గడిచిపోయే కాలం జ్ఞాపకాల పుటల్లోకి జారిపోతుంటే అవన్నీ కండ్ల ముందుంచే ఒకే ఒక్క అద్భుతమైన ప్రక్రియ ఫొటోగ్రఫీ.
ఒకప్పుడు ఫొటో దిగాలంటే ఫొటోస్టూడియోకు వెళ్లాల్సిందే .. కానీ నేటి మోబైల్ యుగంలో కనిపించే ప్రతి దృశ్యాన్ని సెల్‌ఫోన్‌ల్లో బంధించేస్తున్నారు. ఇది కొందరికి అలవాటుగా మారితే.. మరికొంత మందికి జీవనోపాధిగా (వృత్తి) మారిపోయింది. ఆకాశంలో మబ్బులు కనిపించినా, చిరుజల్లు పలకరించినా, నెలవంక కనిపించినా, సూర్యుడు ఉదయించినా, అస్తమించినా, అది అందంగా కనపడితే చాలు చిన్నా పెద్ద తేడా లేకుండా ఎవరైనాసరే క్లిక్ అనిపిస్తారు.
ప్రస్తుత సోషల్ మీడియా కూడా తీసిన ఫోటోలకు వేదికగా మారుతోంది. యువత వారు తీసిని ఫొటోలను ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇలాంటి సామాజిక మాధ్యమాల ద్వారా అద్భుతమైన ఛాయచిత్రాలు సెలబ్రెటీల పాత చిత్రాలను ఎఫ్‌బీలో అప్‌డేట్ చేస్తూ లైక్‌లు సంపాదిస్తున్నారు.
అందమైన ఛాయాచిత్రాలను తీయడంలో ఎవరి శైలి వారిదే.. ప్రతి ఫొటో వెనుక ఒక జ్ఞాపకం, అనుభూతి దాగి ఉంటుంది.. ఫొటోలు తీపి గుర్తులకు నిదర్శనం. తాజాగా గత శుక్రవారం (03-09-2021) నాడు ఖమ్మం జిల్లా పాల్వంచ లో కిన్నెరసాని కి పోయే దారిలో తేల్లవారుజామున తీసిన అందమైన ఫొటో ఇది.. ప్రకృతికి మించిన అందం లేదు… ఆనందం కూడా లేదు. నేను తీసిన అందమైన ఈ క్లిక్ పై మీరూ ఒక లుక్కేయండి..
–షేక్.బహర్ అలీ