రద్దీ ఎక్కువున్న ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి: కేంద్రం సూచన
![](https://clic2news.com/wp-content/uploads/2021/05/Mask-750x313.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): ప్రపంచంలోని పలు దేశాల్లో మళ్లీ కరోనా విజృంభించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చైనా, అమెరికా సహా పలు దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీవ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రపంచంలోని పలు దేశాలలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని, నిఘా మరింత పటిష్టం చేయాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. కరోనాపై కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కు ధరించాలని సూచించింది.