ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 28 మంది మావోయిస్టులు మృతి

చర్ల (CLiC2NEWS): దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. చత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో మరికొందరికి తీవ్ర గాయాలయినట్లు తెలిసింది. నారాయణపూర్ జిల్లాలోని మథ్ ఏరియాలో నక్సల్స్ పెద్ద ఎత్తున ఉన్నట్లు పక్కా సమాచారం రావడంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేష్ చేపట్టాయి.
ఈ సోదాల్లో బాగంగా బుధవారం ఉదయం నుంచి పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుతున్నాయి. కాగా ఈ సోదాల్లో బీజాపూర్, దంతెవాడ, నారాయణపూర్ డిఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. అబుజ్మద్లోని బటైల్ అడవుల్లో జరుగుతున్న ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనాయకుడు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్ ను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధ్రువీకరించారు.