ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 30 మంది మావోయిస్టులు మృతి

రాయ్‌పుర్ (CLiC2NEWS): ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. బీజాపుర్-దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న గంగలూరు పరిధి అండ్రి అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు నిఘా పెట్టారు. గురువారం ఉదయం సంయుక్త బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇరువర్గాల మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. ఘటనా స్థలంలో 26 మంది మావోయిస్టులు మృత దేహాలతో పాటు భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఇదే సమయంలో కాంకెర్ జిల్లాలోనూ ఎదుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో డిఆర్‌జి, బిఎస్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సామాచం. ప్రస్తుతం బీజాపుర్, కాంకెర్ జిల్లాల్లో యాంటి-నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ ఏడాదిలో ఇది రెండో భారీ ఎన్‌కౌంటర్ ఫిబ్రవరి 9న బీజాపుర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు.