ఆర్టీసీ బస్టాండ్లలో అధిక ధరలపై ఎండీ సజ్జనార్ హెచ్చ‌రిక‌లు

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని బస్టాండ్లలో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయన్న‌ ఫిర్యాదులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు, ఒప్పందం రద్దుకు నోటీసులు పంపినట్లు ఎండి ఈ మేర‌కు వెల్లడించారు. అలాగే ఉచిత మరుగుదొడ్ల వద్ద డబ్బులు వసూలు చేసిన వారికి కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. బస్టాండ్లలోని స్టాళ్లలో అధిక ధరలకు వస్తువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.