Mandapeta: ప‌ట్ట‌ణంలో దోమల నివారణకు చర్యలు..

మండపేట (CLiC2NEWS): పట్టణంలో వార్డులన్నిటిలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి పేర్కొన్నారు. గతంలో తాను వార్డు పర్యటనలు చేసిన సమయంలో ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని దోమల నివారణ చర్యలకు ఉపక్రమించినట్టు ఆమె తెలియజేశారు. గురువారం శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు నేతృత్వంలో పది వార్డులు లక్ష్యంగా చేసుకొని ఎబిట్ ఆయిల్ ను స్ప్రేయింగ్ మిషన్ ల ద్వారా డ్రైన్ లలో పిచికారీ చేశారు. వార్డుకి ఇద్దరు చొప్పున పట్టణంలోని పది వార్డుల్లో మొత్తం 20 మంది వీధులన్నీ తిరిగి స్ప్రేయింగ్ చేశారని తెలిపారు. ఎబిట్ ఆయిల్ స్ప్రేయింగ్ చేయించడం వల్ల మురికి గుంటలు, డ్రైన్ లలో గూడు కట్టుకున్న లార్వా నశించి పోతుందని తెలిపారు. రోజుకు పది వార్డులు వంతున మొత్తం 30 వార్డులు పూర్తి చేస్తామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.