గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకున్న మెగాస్టార్

హైదరాబాద్ (CLiC2NEWS): అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. పద్మభూషణ్ , పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్న ఆయన తాజాగా గిన్సిస్ బుక్ వరల్డ్ రికార్డ్‌ను అందుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24వేల స్టెప్పులతో అలరించినందుఉ ఆయనకు ఈ రికార్డు దక్కింది. గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు అమిర్‌ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి. గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, బాబి.. నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, తమ్మా రెడ్డి భరద్వాజ, కెఎస్ రామారావు, సురేశ్ బాబు, జెమిని కిరణ్ మైత్రి రవిశంకర్ తదితరులు హాజరయ్యారు.