జీవితాంతం కళామతల్లి సేవలోనే.. చిరంజీవి
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లనని.. జీవితాంతం కళామతల్లి సేవలేనే ఉంటానని స్పష్టం చేశారు. నగరంలో నిర్వహించిన బ్రహ్మా ఆనందం చిత్రం ప్రి రిలీజ్ లో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాల వైపు మళ్లీ వెళ్తానని పలువురు అనుకుంటున్నారని.. సినీ రంగానికి సంబంధించిన వాటి కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నానన్నారు. రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారన్నారు.