నిర్మల్‌లో ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్

నిర్మల్ (CLiC2NEWS): జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌ను తెలంగాణ అటవీ, పర్యావరణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..
కరోనా సెకండ్ వేవ్ దశలో అధికంగా నమోదు అయ్యాయి. అప్పుడు శ్వాసకోస సమస్య, తీవ్ర అనారోగ్యంతో దవాఖానలో చేరిన వారికి ఆక్సిజన్ అందక చాలా మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందు నిర్మల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. కాగా జిల్లా దవాఖానాగా ఆప్ గ్రేడ్ అయిన నిర్మల్ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకునేందుకు సీఎం కేసీఆర్ రూ. 48.83 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ కే.విజయలక్ష్మి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.