టిఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

హైదరాబాద్ (CLiC2NEWS): టిఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియమితులయ్యారు. ఈ మేరకు సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గోవర్ధన్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనను ఆర్టీసీ చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే గోవర్ధన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గోవర్ధన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సిరికొండ మండలం రావుట్లలో జన్మించారు. ఆయన ఉమ్మడి జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. టీఆర్ఎస్ పార్టీ తరపున 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గోవర్దన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో ఆర్మూర్ నుంచి, 2004లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి గెలుపొందారు గోవర్ధన్.