చిట్యాల ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి (CLiC2NEWS): పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ వీర నారి చిట్యాల ఐలమ్మ (చాకలి ఐలమ్మ) జయంతి సందర్భంగా ఆదివారం ఘన నివాళులర్పించి. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి. ఈకార్య‌క్ర‌మంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సేగ్గెం వెంకట రాణి సిద్దూ, TBGKS రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, కేంగర్ల మల్లయ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో ప్రతి చోట చాకలి ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషకరం అని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి దొర గడిని డీకొన్న వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది లోపు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్ని వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించు కుందాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, PACS ఛైర్మన్, మండల& టౌన్ పార్టీ అధ్యక్షులు, హనుమాన్ టెంపుల్ చైర్మన్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు,జిల్లా మైనార్టీ నాయకులు, యూత్ నాయకులు,మహిళ నాయకురాలు, TBGKS నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.