ఎపిలో నేడు, రేపు మోస్తరు వర్షాలు

విశాఖపట్నం (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో ఈశాన్య గాలులు, తేమ గాలుల ప్రభావం వల్ల నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఎపిలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణం క్రమంగా మొదలైంది. అక్టోబరు 23 నాటికి సగానికిపైగా ప్రాంతాల నుంచి, 26వ తేదీన పూర్తిగా నైరుతి ఉపసంహరణ ఉంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అక్టోబరు 26న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.