పవన్ వ్యాఖ్యలకు మోహన్‌బాబు స్పంద‌న‌!

హైదరాబాద్‌ (CLiC2NEWS): సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ `రిపబ్లిక్‌` సినిమా ప్రీరిలీజ్‌ కార్యక్రమం సంరద్భంగా చేసిన వ్యాఖ్యలపై సీనియర్‌ నటుడు మోహన్‌బాబు స్పందించారు.

ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

‘‘నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్‌కల్యాణ్‌ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంభోదించాను. పవన్‌కల్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమీలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్‌. సంతోషమే. ఇప్పుడు `మా` ఎలక్షన్స్‌ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడన్న సంగతి మీకు తెలిసిందే. అక్టోబరు 10వ తేదీన ఎలక్షన్స్‌ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకీ నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటును నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్‌కి వేసి వాళ్ళ‌ ని గెలిపించాలని కోరుకుంటున్నా.“
అని మోహన్‌బాబు ట్వీట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.