దేశంలో 300 దాటిన ఒమిక్రాన్ కేసులు.. ప్రధాన మంత్రి ఉన్నత స్థాయిసమీక్ష

ఢిల్లి (CLiC2NEWS): భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా నమోదయిన కేసులతో కలిపి దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 300 పైగా నమోదయ్యాయి. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోడి ఉన్నతాధికారులతో సమీక్షనిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, పలువురు నిపుణులు ఒమిక్రాన్, కరోనా వ్యాక్సినేషన్‌పైనా చర్చించనున్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతోరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్ని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. పాజిటివిటి రేటు ఎక్కవగా ఉన్న ప్రాంతపై దృష్టిసారించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ తెలిపారు. ముప్పు ముంచుకురాకముందే కఠిన ఆంక్షలు అమలు చేయాలని, అవి కనీసం 14 రోజులు అమలులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారీ సభలు, జనసమూహాల్ని నియంత్రించాలని ముఖ్యంగా పండగల వేళ రాత్రి పూట కర్ఫ్యూలను అమలు చేయలని ఆదేశించారు.