ఎపి శాసన మండలి ఛైర్మన్‌గా మోషేన్‌రాజు

అమరావతి(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్‌గా కొయ్యే మోషేన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎపి సిఎం జగన్, మంత్రులు, ఎమ్మల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోషేన్ రాజు నిబద్ధత గల రాజకీయ నాయకుడు అని అన్నారు. తదనంతరం మోషేన్ రాజు మాట్లాడుతూ.. ఈ స్థాయికి వస్తానని ఈనుకోలేదు. ఎప్పుడూ వైఎస్సార్ కుటుంబంతో ఉండేందకు ఇష్టపడతాను. ఆ కుటుంబం ఎంతో మంది సామాన్యులను ఉన్నతస్థాయికి తీసుకువచ్చిందని అన్నారు. ఆయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి. ఆయన 1987 నుంచి వరుసగా నాలుగుసార్లు మునిసిపల్ కౌన్సిలర్‌గా, రెండుసార్లు ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఎపిసిసి ఎస్సి, ఎస్టి సెల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా, కాంగ్రెస్ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ భీమవరం పట్టణ అధ్యక్షుడిగా వివిధ పదవులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సిపిలో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీకి మోషేన్ రాజు సేవలను గుర్తించిన సిఎం జగన్ గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సి చేశారు.