TS: అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు ఉద్యమం: రేవంత్‌రెడ్డి
విద్యార్థి, నిరుద్యోగులతో ఆందోళన చేస్తాం: పిసిసి చీఫ్

హైదరాబాద్ (CLiC2NEWS): దళిత, గిరిజన ఆత్మ గౌరవ సభలు నిర్వహించి, ప్రజలలో చైతన్యం తీసుకువచ్చామని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
రోజువారీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, నిరుద్యోగ సమస్య లపై పోరాటానికి కార్యచరణ సిద్ధం చేశామని రేవంత్ తెలిపారు.
అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు 65 రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తామని వెల్లడించారు.
2014 లో టిఆర్ఎస్ మేనిఫెస్టోలో కెజి టు పిజి ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం అంటూ హామీలు ఇచ్చారు.. కెసిఆర్ అధికారంలోకి వచ్చాక మారుమూల పల్లెల్లో పాఠశాలలు మూసివేశారు. ముఖ్యమంత్రి చర్యలతో నిరుపేదలు విద్యకు దూరమయ్యారు. టిఆర్ఎస్ పాలనలో ఉపాధ్యాయ నియామకాలు జరుగలేదని ఆరోపించారు. కెసిఆర్ కక్ష్య కట్టి 4,368 ప్రాధమిక పాఠశాలలు మూసివేశారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉన్నత చదువులను పేదలకు కాంగ్రెస్ దగ్గర చేసిందని తెలిపారు. సన్నబియ్యం, చేప పిల్లల కోసం కాదు, తెలంగాణ తెచ్చుకుంది పేదలకు కావలసింది విద్య అని అన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి ఉందని మండిపడ్డారు. కాలేజీలు సర్టిఫికెట్‌లు ఇవ్వక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంన్నారని మండిపడ్డారు.
తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వీరందరికీ నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతీ నిరోద్యోగికి సిఎం లక్ష రూపాయలు బాకీ పడ్డారన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఉన్న ఖాళీల కంటే ఇప్పుడే పెరిగాయి. రాష్ట్రంలో 1.9 లక్షల ఉద్యోగాలున్నాయని అన్నారు. నెలకు పదివేల మంది ఉద్యోగ విరణమ చేస్తూన్నారని, నియామకాలు మాత్రం చేయడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టే సైరన్ ఉద్యమాన్ని తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో చేపడతామన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు ప్రతి విద్యార్థి, నిరుద్యోగులు కలిసి రావాలని అన్నారు. అక్టోబర్ 2న దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు పాదయాత్ర చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. వీలైనంత తొందరలోనే హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటిస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు.