సినిమా టికెట్ రేట్లను పెంచుకోవచ్చు: తెలంగాణ సర్కారు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. టికెట్ రేట్ల పెంపు విషయంలో సినీ నిర్మాతల నుండి వచ్చిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టికెట్లపై ధర, జిఎస్‌టి, నిర్వహణ ఛార్జీలు, ఆన్‌లైన్ ఛార్జీలను వేర్వేరుగా ముద్రించాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు సినీ నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జిఓ ప్రకారం ఛార్జీలు:
- ఎసి థియేటర్‌లలో కనిష్ఠ ధర రూ. 50, గరిష్ఠంగా రూ. 150 జిఎస్టి అదనం
- మల్టిప్లక్స్‌ల్లో టికెట్ ధర రూ. 100+జిఎస్‌టి, గరిష్ఠంగా రూ. 250+ జిఎస్‌టి
- సింగిల్ థియేటర్లలో స్పెషల్ రిక్లైనర్ సీట్లకు రూ. 200+జిఎస్‌టి, మల్టిప్లెక్స్‌లలో రూ.300+ జిఎస్‌టి
- నిర్వహణ ఛార్జీల కింద ఎసి థియేటర్‌లలో రూ. 5, నాన్ ఎసికి రూ. 3 వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.