సంక్రాంతికి సందడి చేయనున్న సినిమాలు

ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ మూడు సినిమాలు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. ఆర్ ఆర్ ఆర్ జనవరి 7వ తేదీన విడుదల కానుందని ప్రకటించడంతో మహేష్ బాబు మూవి సర్కారు వారి పాట ఏప్రిల్లో విడుదల చేయబోతున్నట్లు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న భీమ్లా నాయక్ జనవరి 12న విడుదల కానుంది. ఇక రాధే శ్యామ్ జనవరి 14న సంక్రాంతికి సందడి చేయనుంది. దీంతో సంక్రాంతి బరిలో మూడు సినిమాల మధ్య గట్టి పోటి ఉండడం ఖాయం అంటున్నారు అభిమానులు.