కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపి కోటా సీట్లు రద్దు..

ఢిల్లి (CLiC2NEWS): కేంద్రీయ విద్యాలయాల్లో పార్లమెంట్ సభ్యుల కోటా కింద కేటాయించే ప్రత్యేక సీట్లన పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఒక్కో ఎంపికి ప్రతి సంవత్సరం 10 సీట్లను కెవిఎస్ కేటాయిస్తూ వచ్చింది. ఈ కోటా పెంచాలని గత కొంతకాలంగా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెవిఎస్ ప్రత్యేక కోటాను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించటం విశేషం.