ప్రమాణస్వీకారానికి ఒంటెపై వచ్చిన ఎంపి..
ఢిల్లీ (CLiC2NEWS): రాజస్థాన్ కు చెందిన భారత్ ఆదివాసీ పార్టి అధ్యక్షుడు, ఎంపి రాజ్‌కుమార్ రోత్ ప్రామాణ స్వీకారానికి పార్లమెంట్‌కు ఒంటెపై వచ్చారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమ ప్రాంత సాంప్రదాయాలకు , భాషకు పెద్దపీట వేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందని ఎంపిలు తెలుగుదనం ఉట్టపడేలా వస్త్రాధారణలో లోక్‌సభకు హాజరయ్యారయిన విషయం తెలిసిందే. ఎపి , తెలంగాణకు చెందిన ఎంపిలు తెలుగులో ప్రమాణం చేశారు. మరోవైపు కలిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీలోని తన నివాసం నుండి సైకిల్‌పై పార్లమెంట్‌కు వచ్చి అందిరి దృష్టి ఆకర్షించారు. ఈ తరహాలోనే ఆదివాసి పార్టి అద్యక్షుడు రాజ్‌కుమార్ ప్రమాణ స్వీకారానికి ఒంటెపై రాగా.. సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. కాంగ్రెస్ మద్దతుతో బాన్స్వారా లోక్‌సభ స్థానం నుండి ఆయన విజయం సాధించారు.