ఎమ్మెల్యే కోనప్ప సేవలు అద్భుతం: ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ పాతూరి

కాగజ్ నగర్ (CLiC2NEWS): ఎమ్మెల్యే కోనప్ప ఆధ్వర్యంలో సామల సదాశివ విగ్రహ ప్రతిష్టాపన జరగడం మన ఉపాధ్యాయ వ్యవస్థకే గర్వకారణమని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి అన్నారు. పీ ఆర్ టీ యు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప కాగజ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సామల సదాశివ మాస్టారు విగ్రహానికి, వారితో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు.
కోనప్ప ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన సత్రంలో ఆ సంఘ రాష్ట్ర అద్యక్ష ప్రధాన కార్యదర్శులు అంజిరెడ్డి, చెన్నయ్య మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పర్వతి సత్యనారాయణ జిల్లా అద్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్వతి రాజేశ్వర్, శ్రీకాంత్ జాదవ్, రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు కటుకం మధూకర్ తదితరులతో కలిసి భోజనం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోనప్ప ఆధ్వర్యంలో సామల సదాశివ విగ్రహ ప్రతిష్టాపన జరగడం మన ఉపాధ్యాయ వ్యవస్థకే గర్వకారణమని, కోనేరు కోనప్ప యొక్క గొప్పతనాన్ని కొనియాడారు. అంతేకాకుండా వారు స్థానిక ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, సంఘాలకు అతీతంగా, స్నేహపూర్వకంగా వారికి సహకరిస్తూ సమస్యలని పరిష్కరిస్తూ ఇక్కడ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయ రిక్రూట్ మెంట్ లో స్థానికులకు ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలని, నిరుద్యోగులకు ఉచితంగా మూడు నెలల శిక్షణ కార్యక్రమం ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా జరగలేదని స్పష్టం చేశారు. ఇక్కడి నిత్య అన్నదాన సత్రం ఒక అద్భుతం అని, వారు అందిస్తున్న భోజనం స్వయంగా ఇంట్లో తిన్నంత తృప్తినిచ్చింది ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీ ఆర్ టీ యు తెలంగాణ మంచిర్యాల జిల్లా అద్యక్ష ప్రధాన కార్యదర్శులు ధరణి కోట వేణుగోపాల్, సూరినేని గంగాధర్, ఆదిలాబాద్ జిల్లా అద్యక్ష ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌవ్హాన్, నూర్ సింగ్, రాష్ట్ర, జిల్లా నాయకులు, చైతన్య, సాగర్, సాంబయ్య, సుధాకర్, గోపికిరణ్, స్వామి, శ్యాంసుందర్,సుధాకర్, అరవింద్ గోపాల్, బి. కైలాస్ , బి. వినోద్ కుమార్, ఎ. చంద్రశేఖర్, జాడి రమేష్ తదితరులు ఉన్నారు.