మూసీ ప్రాజెక్టు 8 గేట్లు, పులిచింతల ఐదు గేట్లు ఎత్తివేత

నల్లగొండ (CLiC2NEWS): తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో మూసీ ప్రాజెక్టు 8 గేట్లు, పులిచింతల ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తి భారీగ నీటిని కిందికి వదులుతున్నారు.
ఎగువన వర్షాలతో ప్రాజెక్టులోకి 13,401 క్యూసెక్కుల వరద మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం వస్తున్నది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 13,401 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
- ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు.
- ప్రస్తుతం 638.50 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది.
- మూసీ గరిష్ట సామర్థ్యం 4.46 టీఎంసీలుకాగా,
- ప్రస్తుతం 2.88 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
పులిచింతల ఐదు గేట్లు ఎత్తివేత
పులిచింతలకు వరద పోటెత్తడంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తివేశారు.
- ప్రాజెక్టులోకి 70,812 క్యూసెక్కుల నీరు వస్తుండగా,
- 61,358 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
- పులిచింతల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు
- ప్రస్తుతం 33.40 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.