ఆస్కార్ కమిటీలో సభ్యత్వం.. వారందరికీ నా శుభాకాంక్షలు: రాజమౌళి

హైదరాబాద్ (CLiC2NEWS): ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందంలోని ఆరుగురికి ఆస్కార్ కమిటీలో సభ్యత్వం వచ్చినందుకు దర్శకధీరుడు రాజమౌళి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌చేశారు. “భారతీయ చలన చిత్రానికి సంబంధించి ఈ ఏడాది ఆహ్వానం అందుకున్న వారందరికీ నా అభినందనలు” అంటూ.. రామ్ చరణ్, ఎన్‌టిఆర్ , కీరవాణి, చంద్రబోస్, సెంథిల్, సిరిల్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఆస్కార్ అవార్డులను ప్రధానం చేసే ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అర్ట్స్ అండ్ సైన్సెస్.. ఈ ఏడాది ఆస్కార్ కమిటీలో కొత్తగా 398 మందికి సభ్యత్వం కల్పించింది. ఇక రాజమౌళి ట్వీట్‌కు నెటిజన్లు భారీగానే స్పందిస్తున్నారు. మీరు లేకుండా ఆ లిస్టు అసంపూర్తిగా కనిపిస్తుందని.. , మీకు కూడా ఆహ్వానం వచ్చి ఉంటే ఆనందం రెట్టింపయ్యేదని.. ఇలా నెటిజన్లు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.